
ఢిల్లీలో బాంబ్ పెల్లుళ్లు
జగిత్యాల పోలీసుల ముమ్మర తనిఖీలు
చర్చ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఢిల్లీలో జరిగిన బాంబ్ పెల్లుళ్ల ఘటన తో స్పందించిన కేంద్ర హోం శాఖ హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల పోలీసులు ప్రజల భద్రత కై రంగంలోకి దిగారు.భద్రత చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, పోలీసు జగిలాలు, బాంబ్ డిస్పోజల్ టీం తో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లు, జన సమూహం ఎక్కువగా ఉండే పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలో భాగంగా అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులు లేదా భద్రతకు ముప్పు కలిగించే అంశాలపై ప్రత్యేక తనిఖీ లు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మట్లాడుతూ ప్రజల సహకారంతోనే భద్రతా చర్యలు సమర్థవంతంగా కొనసాగుతాయని అన్నారు. హై అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, లేదా 100 నెంబర్ కికు సమాచారం అందించాలి అని జిల్లా పోలీస్ శాఖ నిరంతరం ప్రజల రక్షణలో తగిన చర్యలు తీసుకుంటుంది ఎస్పీ తెలిపారు.