News & Views

చర్చ, సత్తుపల్లి: జూదం రాయుళ్ళకు పోలీసు వారి హెచ్చరిక..

 

ప్రత్యేక షీట్లు ఓపెన్ చేయబడును – సీఐ తుమ్మలపల్లి శ్రీహరి..

సత్తుపల్లి మండల ప్రజలకు తెలియచేయునది ఏమనగా రాబోవు డిసెంబర్ -31, మరియు సంక్రాంతి పండుగ సందర్భముగా ఎక్కువరోజులు సెలవులు ఉన్నందున ప్రజలు వారి వారి ఊళ్ళకు వెళ్ళే సమయములో వారి ఇండ్లకు తాళాలు వేసి, ఇంట్లో ఎలాంటి విలువైన ఆభరణాలు పెట్టకుండా సరైన జాగ్రతలు తీసుకొని వెళ్లవలెను, మరియు పోలీసు వారికి తెలియపరచవలెను

కోళ్ళపందేలు..

రాబోవు డిసెంబర్ -31, మరియు సంక్రాంతి పండుగ సందర్భముగా ఎవరైనా కోళ్ళపందేలు వేయుటకు శిబిరాలు నిర్వహించినా, కోళ్ళ పందేలు వేసిన, కత్తులు కట్టినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొని నిర్వహించిన వారిపై, కోడి పందేలు వేసిన వారిపై పోలీస్ స్టేషన్ నందు ప్రత్యేక నిఘా షీట్లు తెరవబడును.
మరియు బైండ్ ఓవర్ కూడా చేయబడును.
రాబోవు డిసెంబర్ -31, మరియు సంక్రాంతి పండుగ సందర్భముగా ఎవరైనా జూద శిబిరాలు నిర్వహించినా, ఎటువంటి జూదము ఆడినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొని నిర్వహించిన వారిపై, జూదము ఆడిన వారిపై పోలీస్ స్టేషన్ నందు ప్రత్యేక నిఘా షీట్లు తెరవబడును అని సత్తుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి హెచ్చరించారు.