News & Views

చర్చ పాల్వంచ: నల్ల బ్యాడ్జీలతో నిరసన

నల్ల బ్యాడ్జీలతో నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
చర్చ పాల్వంచ
టీఎస్ఎస్యూఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 33 జిల్లాలలో మధ్యాహ్న భోజనం సమయంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో కూడా అన్ని మండలాలు నిరసన తెలపడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చందు భట్టు ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం ఎమ్మార్సీ స్టాఫ్ ఉద్యోగులను తొలిగిస్తూ నిన్న ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. జరిగిన తప్పిదం పై సరైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భోజన విరామ సమయంలో పాల్వంచ మండల విద్యా వనరుల కేంద్రం ముందు నిరసన తెలిపిన సమగ్రశిక్ష ఉద్యోగులు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చందు భట్టు, మండల అధ్యక్షులు అర్జున్, ఐఈఆర్పి దుర్గ, అనిత, సీఆర్పీలు ప్రభాకర్, గంగరాజు, కిషన్, శ్రీనివాస్, మెసెంజర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు