News & Views

చర్చ, వరంగల్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన


తెలంగాణలో ఉన్న కాటన్ జిన్నింగ్ మిల్లులలో ఎల్ 1,ఎల్ 2,ఎల్ 3 విధానాన్ని రద్దు చేసేంతవరకు తెలంగాణలో ఉన్న కాటన్ జిన్నింగ్ మిల్లులు మూసి ఉంటాయని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు.

పత్తి కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 322 నోటిఫైడ్ టీఎంసీ జిన్నింగ్ మిల్లలు మూతపడ్డాయి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎల్ 1, ఎల్2, ఎల్ 3 నిర్ణయంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని లేకుంటే ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీ విధానాన్ని రద్దుచేసి అన్ని జిన్నింగ్ మిల్లులకు సమానంగా పత్తి పంపించాలని తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు.