చర్చ, కరీంనగర్: ఘనంగా పీవీ వర్ధంతి..
- పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారతదేశం – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సత్తు మల్లేశం
- ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప నేత పీవీ నరసింహారావు – కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైద్యుల అంజన్ కుమార్
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతిని గణంగా నిర్వహించారు. కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నాయకులు పి.వి. నరసింహారావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
బహుభాషా కోవిదుడు, 1991 నుండి 1996 వరకు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి, పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టడంతో గ్లోబలైజేషన్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు గారని, ప్రధానిగా పీవీ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో నేడు ప్రపంచ దేశాలతో మనదేశం అన్ని రంగాల్లో పోటీ పడుతుందని సత్తు మల్లేశం, వైద్యుల అంజన్ కుమార్, కర్ర రాజశేఖర్ అన్నారు. పీవీ మన ప్రాంతానికి చెందిన వారు కావడం మనందరం గర్వించదగ్గ విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షునిగా, అనేక సంస్కరణల ద్వారా భారతదేశ ప్రధానిగా ఈ lదేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చినా, మైనారిటీ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి ఈ దేశాన్ని ముందుకు నడిపించి, వారి పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పీ.వీ సేవలను స్మరించుకుంటూ, ఆయన చేపట్టిన చర్యలను కొనియాడుతూ కాంగ్రెస్ శ్రేణులుగా మేమంతా వారి ఆశయ సాధన కోసం, వారు కన్న కలలను నెరవేర్చడానికి కృషి చేస్తామన్నారు.