News & Views

చర్చ,రామగిరి: రజకులు రాజకీయంగా ఎదగాలి – వార్డు సభ్యులను సన్మానించిన జిల్లా సమన్వయకర్త నాగెల్లి సాంబయ్య

రజకులు చైతన్యవంతులై రాజకీయంగా ముందుకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా రజక సంఘం సమన్వయకర్త నాగెల్లి సాంబయ్య అన్నారు. శనివారం ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలిచిన రజక సంఘం నాయకులను రామగిరి మండల రజక సంఘం అధ్యక్షులు ధర్ముల రాజయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఏఐటీయూసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా రజక సంఘం సమన్వయకర్త నాగెల్లి సాంబయ్య మాట్లాడుతూ, ఎన్నికలలో భాగంగా బ్యాలెట్ సిస్టం ద్వారా ఈరోజు మా రజక కుల బాంధవులైనటువంటి మాదాసి శ్రీనివాస్, బేగంపేట వార్డ్ మెంబర్ గా, అదే విధంగా పున్నం మనితేజ రత్నాపూర్ వార్డ్ మెంబర్ గా, అదే విధంగా నాగేపల్లి వార్డ్ మెంబర్ గా మైలారం అనిల్, అలాగే రాజబాబు అనే మిత్రుడు ముత్తారం మండలం పోతారం గ్రామానికి వార్డు మెంబర్ గా, గెలవడం పట్ల రజక కుల బంధువులందరికీ సంతోషమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా గ్రామాల వార్డులలో రజకులను గుర్తించి వార్డ్ మెంబర్లుగా ఎన్నుకున్నందుకు ఆ గ్రామాల ప్రజలకు రామగిరి మండల రజక సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డ్ సభ్యులుగా ఎన్నికైన వారు వచ్చే ఐదు సంవత్సరాలలో గ్రామాలకు మంచి పనులు చేస్తూ, పేరు ప్రఖ్యాతులు గడించి మరింత ఉన్నతంగా రాజకీయాలలో ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించలన్నారు. అనంతరం వార్డు సభ్యులను శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సెంటినరీ కాలనీ పట్టణ అధ్యక్షులు పున్నం సమ్మయ్య, రామగిరి మండల సలహాదారు కొలిపాక ఐలయ్య, సి ఎన్ సి ఉపాధ్యక్షులు చెలికట్ల మల్లేష్, రత్నాపూర్ గ్రామ రజక అధ్యక్షులు ధర్ముల సంజీవ్ కుమార్, నాయకులు ధర్ముల శంకర్, నల్లూరి లింగయ్య, ఏదుల సదయ్య,దురిశెట్టి రవీందర్, ధర్ముల చిన్న భూమయ్య, దురిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.