News & Views

చర్చ,రామగిరి: పదవీ విరమణ పొందనున్న జీఎం సుధాకర్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన రామగిరి పాత్రికేయులు

ఆర్జీ–3 జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు ఈ నెల 30న పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా రామగిరి సెంటినరీ కాలనీకి చెందిన పాత్రికేయులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు గనుల పరిసర ప్రాంతాలు, ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలిపారు. కార్మిక సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో నరేంద్ర సుధాకర్ రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పీవీ రావు, వాసుదేవరావు, బుర్ర తిరుపతి గౌడ్, మల్యాల రమేష్ గౌడ్ నల్లూరి లింగయ్య, కాపర్తి వెంకటేష్, చిలుక సురేష్, జ్యోతుల ప్రవీణ్, సూత్రం శ్రీధర్, చింతం కిరణ్, ఈనాడు కృష్ణ, చిగురు అనిల్,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.