చర్చ, మల్యాల,: ధాన్యం కొంటలేరని రైతుల రాస్తారోకో

ధాన్యం కొంటలేరని రైతుల రాస్తారోకో
చర్చ, మల్యాల, జగిత్యాల : ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి దాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. కొడిమ్యాల మండలం లోని పూడూరు గ్రామ పరిధిలోని రైతులు కరీంనగర్ – జగిత్యాల రహదారి పై బైటాయించి రాస్తా రోకో చేశారు. దీంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయానికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులను తరలించే ప్రయత్నం చేశారు