News & Views

చర్చ, కొత్తగూడెం: రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపర్చిన సింగరేణి కళాశాల విద్యార్థిని

అభినందించిన కళాశాల యాజమాన్యం

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపర్చిన సింగరేణి కళాశాల విద్యార్థిని
– అభినందించిన కళాశాల యాజమాన్యం

చర్చ, కొత్తగూడెం:
తెలంగాణ శాఖ గో సేవా విభాగం వారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ‘గోవుల’ అంశంపై ఇటీవల పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలలో నిర్వహించిన పోటీలలో ఎంపికైన 1871 మందికి రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించగా, రాష్ట్రస్థాయిలో స్థానిక సింగరేణి కాలరీస్‌ ఉమెన్స్‌ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న జితక తనిష్కకు ప్రత్యేక బహుమతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం తనిష్కను స్థానిక సింగరేణి మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో యాజమాన్యం శాలువాతో ఘనంగా సత్కరించి నగదు పురస్కారం, చెక్కును అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.హెచ్‌.శారద మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపర్చడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,11,890 మంది ఈ పోటీలలో పాల్గొనగా తనిష్క రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం గోవుల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గో సేవా ప్రముఖ కొలిశెట్టి ఏకస్వామి, నగర కార్యవాహ మదన్‌రెడ్డి, గో సేవ ప్రముఖ్‌ వెంకట్, గో సేవ కన్వీనర్‌ అమిరిశెట్టి నాగేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు దేవిక, సి.హెచ్‌.శారద, శైలజ, జి మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు