News & Views

చర్చ , కొత్తగూడెం: రతన్ టాటా సేవలు అజరామరం: కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొనియాడారు. ఆదివారం కొత్తగూడెంలోని టాటా ఏఐఏ బ్రాంచ్ లో రతన్ టాటా 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. రతన్ టాటా వంటి మహోన్నత వ్యక్తి భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, తన సంపాదనలో సింహభాగాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. లాభాల కంటే విలువలకే ప్రాధాన్యతనిచ్చిన గొప్ప మానవతా వాది రతన్ టాటా అని అన్నారు. భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అనన్యం అని పేర్కొన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలనీ పిలుపునిచ్చారు. అనంతరం లీడర్ ఝాన్సీ రాణి ఫైనాన్సియల్ సర్వీసెస్. C. E. O) కమల రాణి కొచ్చెర్ల. సీనియర్ బిజినెస్ అసోసియేట్ రక్త దానం చేస్తూ తన టీం తో కూడా రక్త దానం చేయించారు, అందరికి డీఎస్పీ అభినందిస్తూ వారికి సర్టిఫికేట్ ను అందించారు. ఈ కార్యక్రమంలో లీడర్స్ చందు, MDRT సామ్రాజ్యం, డేవిడ్ రాజు, ప్రభు, లాల్ బాబు, జ్యోత్స్న, రాకేష్ కాంత్, సురేఖ,టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్, బామ్ రాహుల్ వెంకటేష్, లీడర్లు, అడ్వైసర్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.