News & Views

చర్చ, కొత్తగూడెం : దేశభక్తి పెంపొందించే దిశగా సంస్కర్తలు ముందుకు రావాలి – శ్రీ సరస్వతీ శిశు మందిర్ విభాగ్ అధ్యక్షులు దేవకి వాసుదేవ రావు

లక్ష రూపాయలు అభివృద్ధిపనులకు ప్రకటించిన విద్యా సంస్కర్త

దేశభక్తి పెంపొందించే దిశగా సంస్కర్తలు ముందుకు రావాలి

శ్రీ సరస్వతీ శిశు మందిర్
విభాగ్ అధ్యక్షులు
దేవకి వాసుదేవ రావు

లక్ష రూపాయలు అభివృద్ధిపనులకు ప్రకటించిన విద్యా సంస్కర్త

మానవ విజ్ఞానానికి విశ్వరూపమే చదువు

మానవ విజ్ఞానానికి విశ్వరూపమే చదువు,అందుకొరకు విద్యా సంస్కర్త లు బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి దోహద పడాలని శ్రీసరస్వతీ శిశుమందిరాల విభాగ్ అధ్యక్షులు దేవకి వాసుదేవ రావు విద్యా సంస్కర్తలైన ప్రబంధ కారిని కమిటీ సమితి సంచాలకుల సమావేశములో సూచించారు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ ను విభాగ్ అధ్యక్షులు కార్యవర్గం శనివారం సందర్శించింది. విభాగ్ అధ్యక్షులు శ్రీమాన్ దేవకి వాసుదేవ రావు శిశు మందిర్ అభివృద్ధిపై దిశా నిర్దేశం చేశారు పాఠశాల అభివృద్ధి పనుల నిమిత్తం లక్ష రూపాయలను ఆయన ప్రకటించారు పాఠశాల ఒక ఇల్లు వంటిదని ఉపాధ్యాయులు తల్లిదండ్రుల వంటి వారిని ,విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించే విధంగా విలువలతో విద్యను అందించుటలో శ్రీ సరస్వతి విద్యా మందిరాలు నిలయాలై నిలిచాయని ఆయన కొనియాడారు. శిశు తరగతి నుండి పాఠశాల విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు అలవాడే విధంగా ఆచార్యులు తీర్చిదిద్దాలని ఆయన సూచించారు పాఠశాల ప్రబంధ కారినికమిటి అధ్యక్షులు శంకర్ బాబు కార్యదర్శి గుర్రం వెంకటరెడ్డి కోశాధికారి ఆర్ఎస్ రామానుజం పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న తీరును ఆయన ప్రశంసించారు. విలువతో కూడిన ఆధ్యాత్మిక విద్యను అందించడం శిశు మందిరాలు ముందు వరసలో నిలుస్తున్నాయని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు శ్రీ సరస్వతి శిశు మందిరాల మండల జిల్లా స్థాయిలో ఉన్న విద్యాసంస్కర్తలు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు విద్యా సంస్కర్తలు పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రకటించడం పై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యా అభివృద్ధికి విద్యా సంస్కర్తలు ముందుకు రావాలని ఆయన సూచించారు విభాగ్ ప్రభారి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు విద్య విషయం సాంస్కృతిక విషయాలపై దిశా నిర్దేశం చేశారు శిశుమందిర్ ప్రబంధ కారి కమిటీ లో అధ్యక్షులుగా తాటిపల్లి శంకర్ బాబు ఆధ్వర్యంలో ,అభివృద్ధి పనుల్లో ముందువరుసలో నిలచిన కార్యదర్శి గుర్రం వెంకటరెడ్డి , కోశాధికారీ ఆర్ఎస్ రామానుజమ్ ల పట్టుదల ప్రశంసనీయమని అన్నారు. విభాగ్ అధ్యక్షులు గా బాధ్యత తీసుకున్న నాటినుండి శ్రీమాన్ దేవకి వాసుదేవ రావు కృషి ప్రశంసనీయమని ఆయన అభివర్ణించారు అనంతరం ఆచార్యులతో బహుభాష ప్రావీణ్యం పై ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి కరవెల్లి వెంకట శ్రీనివాసరావు, పాఠశాల ప్రబంధ కారిని కమిటి అధ్యక్షులు తాటిపల్లి శంకర్ బాబు కార్యదర్శి గుర్రం వెంకటరెడ్డి కోశాధికారి ఆర్ఎస్ రామానుజమ్ విభాగ్ సహకార దర్శి పిల్లి రాజేశ్వరరావు సలహా కమిటీ సంచాలకులు ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కొదుమూరి శ్రీనివాస్ ,డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ,త్రినాధ్ ,బోగ నారాయణ అయిత ప్రకాష్ రావు, శైక్షనిక్ ప్రము ఖ్ కృష్ణమూర్తి, పాఠశాల ఆచార్యులు పాల్గొన్నారు