News & Views

చర్చ హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

 

చర్చ హైదరాబాద్ :తెలంగాణ : గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ -1 నియామకాలపై సింగిల్‌ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్‌ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్‌ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పును వెలువరించింది.