News & Views

చర్చ,పాల్వంచ : రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన

రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
పాల్వంచ చర్చ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన: బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేపట్టిన రిటైర్డ్ ఉద్యోగులు..తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్ అయిన ఒక ఉద్యోగిణి మాట్లాడుతూ, తమకు రావాల్సిన ₹60 లక్షల నుంచి ₹80 లక్షల వరకు ఉన్న అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపివేశారని ఆరోపించారు.రిటైర్‌మెంట్ బకాయిలు అందకపోవడం వల్ల ఉద్యోగుల కుటుంబాలు, పిల్లల పెళ్లిళ్లు, చదువులు వంటి ముఖ్య విషయాలు ఆగిపోయాయని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అద్దె ఇళ్లలో ఉంటూ బాధపడుతున్నారని తెలిపారు,మా డబ్బులు మాకు ఇవ్వండి” అని ప్రభుత్వాన్ని కోరుతూ, అన్ని డిపార్ట్‌మెంట్ల రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను డిసెంబర్ కల్లా STO (సబ్ ట్రెజరీ ఆఫీస్) ద్వారా శాంక్షన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమ ధర్నాను విరమించుకోమని, తమ విజ్ఞప్తిని ప్రభుత్వం ఆలకించాలని కోరారు