చర్చ : రామగిరి : నూతన సర్పంచ్ ను సన్మానించిన రిటైర్డ్ ఐజి
నూతన సర్పంచ్ ను సన్మానించిన రిటైర్డ్ ఐజి
రామగిరి మండలం రత్నాపూర్ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పల్లె ప్రతిమ పీవీ రావును రిటైర్డ్ ఐజి సుంకరి బాలకిషన్-శ్యామల ఘనంగా సన్మానించారు. హైదరాబాదులో నివాసం ఉండే అతను, తన సొంత గ్రామం రత్నాపూర్ వచ్చిన సందర్భంగా సర్పంచ్ ను శాలువా పూలమాలతో సత్కరించారు. గ్రామాభివృద్ధికి పూర్తిస్థాయిలో తన సహకారం అందిస్తానని అన్నారు. గ్రామాభివృద్ధికి, ప్రజలకు అండగ ఎప్పుడు ఉండాలని ఆయన సూచించారు.