News & Views

చర్చ:భద్రాచలం: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాచలంలో రన్ ఫర్ యూనిటీ….

భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ – 2కే రన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

 

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాచలంలో రన్ ఫర్ యూనిటీ

చర్చ:భద్రాచలం:

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను పురస్కరించుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ – 2కే రన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ రన్‌ భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌ నుండి జూనియర్ కళాశాల గ్రౌండ్‌ వరకు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారత ఐక్యతకు ప్రతీక అని, ఆయన స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి శివనాయక్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సిఐ నాగరాజు, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ 2వ కమాండెంట్ ప్రీత సి, ఎస్‌ఐ సతీష్, ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అలాగే పోలీసు సిబ్బంది, సిఆర్పిఎఫ్ జవాన్లు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగెత్తారు. రన్‌ ఫర్ యూనిటీ ద్వారా ఐక్యత, సోదరభావం, దేశభక్తి విలువలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలని అధికారులు పిలుపునిచ్చారు.