News & Views

చర్చ: కమాన్ పూర్: సర్ధార్ సర్వాయి పాపన్న బహుజనుల గుండె చప్పుడు -మధుయాష్కి గౌడ్

బహుజనుల గుండెలలో చిరస్మరణీయుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు . తన పుట్టిన రోజు సందర్భంగా ఎల్ బి నగర్ చౌరస్తా ఆదివారం ఆవిష్కరింపబడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ బహుజనులకు కోసం చేసిన సేవను కొనియాడారు. తదనంతరం మన్సూరాబాద్ గౌడ్ సంఘము ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలు అభిమానుల, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమములో హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చెన్నగొని రవీందర్ గౌడ్ .అంబాలా మల్లేష్ గౌడ్, పల్లె గణేష్ గౌడ్ , లక్ష్మి పతి గౌడ్ ,వెంకట్ రమణ, కిషోర్ సంతోష్ ,పాతూరి రాజేందర్ గౌడ్ ,రమేష్ గౌడ్ ,వెంకటస్వామి గౌడ్, సిద్దగాని జగదీష్ గౌడ్ రమణ గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం అశోక్ గౌడ్, బుడ్డా సత్యనారాయణ , బండిగారి అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ , జానీబాయి ,జహంగీర్ బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు