చర్చ: సత్తుపల్లిలో రన్ ఫర్ యూనిటీ…
సత్తుపల్లి పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి

సత్తుపల్లిలో రన్ ఫర్ యూనిటీ…
చర్చ, సత్తుపల్లి:
ఖమ్మం జిల్లాసత్తుపల్లి పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, జాతీయ ఐక్యత దినోత్సవంను పురస్కరించుకుని నేషనల్ యూనిట్ డే లో భాగంగా కల్లూరు ఏ సి పి రఘు ఆధ్వర్యంలో పోలీసులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి అదనపు ఆరవ జడ్జి శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు.
జే.వి.ఆర్ డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన కార్యక్రమం పట్టణంలోని రింగ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్ ఫర్ యూనిటీ ద్వారా ఐక్యత, సోదర భావం, దేశభక్తి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అధికారులు పిలుపునిచ్చారు.