News & Views

చర్చ: రామగిరి : గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర వహించాలి – రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర వహించాలి అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రోజున రామగిరి మండలం జల్లారం గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన తాండ్ర (జుల)యమునా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి హైదరాబాదులోని సచివాలయంలో శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులే నేడు నూతన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతి సర్పంచ్ తమ వంతుగా కీలకపాత్ర వహించి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గాదవేన రమేష్ యాదవ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోనేటి సత్యనారాయణ రామగిరి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుంజపడుగు అరుణ్ కుమార్, సీనియర్ కార్యకర్త చిగురు నరసయ్య ,కట్ట శ్యామ్, గట్టు సునీల్ గౌడ్, జూల సాగర్ ,చింతల శివ, తదితరులు పాల్గొన్నారు.