News & Views

నామినేషన్ కేంద్రాలను ఎన్నికల పరిశీలించిన సాధారణ ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి.

నామినేషన్ కేంద్రాలను ఎన్నికల పరిశీలించిన సాధారణ ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి.

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం

గ్రామపంచాయతీ ఎన్నికలు–2025 నామినేషన్ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాధారణ ఎన్నికల పరిశీలకులు వి. సర్వేశ్వర్ రెడ్డి గురువారం జిల్లాలోని టేకులపల్లి, అల్లపల్లి, గుండాల మండలాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. టేకులపల్లి మండలంలోని గంగారం, అల్లపల్లి మండలంలోని అల్లపల్లి, మార్కోడు గ్రామ పంచాయతీలు, గుండాల మండలంలోని మామకన్ను, గుండాల గ్రామ పంచాయతీలు మరియు గుండాల ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ నిర్వహణ, అధికారులు చేపట్టిన ఏర్పాట్లు, అమలు చేస్తున్న నియమ నిబంధనలను పరిశీలకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతున్న విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తూ, అభ్యర్థులు, ప్రతినిధులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికలను పూర్తిగా నిష్పక్షపాత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సర్వేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఈ పరిశ్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.