చర్చ, సింగరేణి : జీఎం (పీఅండ్‌పీ)ని సన్మానించిన బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

జీఎం (పీఅండ్‌పీ)ని సన్మానించిన బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
చర్చ, సింగరేణి:
సింగరేణి నూతన జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)గా పదవీ బాధ్యతలు చేపట్టిన గాజర్ల దేవేందర్‌ను సింగరేణి కాలరీస్ బీసీ అంyŠ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షులు అమిరిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు బుధవారం జీఎంను ఆయన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పురోభివృద్ధికి తమ అసోసియేషన్ తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అదేవిధంగా బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్. రమేష్, ఉపాధ్యక్షులు వి.వెంకటేశ్వరరావు, కార్పొరేట్ లైజన్ ఆఫీసర్ వేముల మురళి, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గోలి వెంకటేశ్వర్లు, కార్పొరేట్ అడ్వైజర్ యాదగిరి, సభ్యులు వెంకటేశ్వర్లు, పాల నాగరాజు, విజయ్ చందర్, ఇతర సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు