చర్చ, మేడారం: పోక్సో కేసులో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేడారం గ్రామానికి చెందిన బొడిగ రాజయ్య (69) అనే నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. అదనంగా బాధితురాలికి రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
2024 ఏప్రిల్ 7న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు నమోదు అయింది. దర్యాప్తు అనంతరం పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేయగా, పెద్దపల్లి వేగవంతమైన మరియు పోక్సో ప్రత్యేక కోర్టు నేరం రుజువైనట్లు నిర్ధారించింది.
ఈ కేసులో అభియోగ పక్షం, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి బాధితురాలికి న్యాయం దక్కేలా చేశారు.