News & Views

చర్చ, కరీంనగర్: ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ.
  • దేశంలో శాస్త్రీయ విద్యా విధానం అమలుకై పోరాడుదాం.
  • విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలి
  • ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజనీకాంత్

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ నుండి మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ తీసి ఆవిర్భావ సభ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆశయాలు అయిన స్వాతంత్రం ప్రజాస్వామ్యం, సోషలిజం జెండాను జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఎగరవేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయి మాట్లాడారు. ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ పురుడు పోసుకొని 55 ఏళ్ళు పూర్తిచేసుకుని 56వ సం..లో అడుగు పెట్తిందన్నారు. విద్యారంగ సమస్యలపై దేశంలో నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందనీ, శాస్త్రీయ విద్యా విధానం, అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమానమైన విద్యను అందించడం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. 56 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు అసువులు బాసారని, వారి స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలపైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలు చేయడమే కాకుండా అనేక విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐదని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఉన్నత విద్య నియంత్రణ కోసం వికసిత భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ -2025 పేరుతో నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెస్తోందని, దేశంలోని వైద్య, న్యాయ విద్య మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒక గొడుగు సంస్థలా పనిచేస్తుందని అన్నారు. ఇందులో చైర్‌పర్సన్‌తో పాటు పన్నెండు మంది సభ్యులు ఉంటారని, ఈ చట్టం ద్వారా ఏర్పడే వికసిత భారత్‌ శిక్షా వినియమన్‌ పరిషద్‌ (నియంత్రణ) బీ వికసిత భారత్‌శిక్షా గుణవత్తా పరిషద్‌ (అక్రిడిటేషన్‌)బీ వికసిత భారత్‌ శిక్షా మానక్‌ పరిషద్‌ (ప్రమాణాలు) మొదలైన పదజాలం ఉన్నత విద్యను కాషాయీకరించే రాజకీయ దృక్పథాన్ని తెలియ జేస్తాయని ఆరోపించారు. తక్షణమే దీనిని వెనక్కి తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ విద్యలో కులాన్ని, మతాలను చోపించే ప్రయత్నం చేస్తుందని, నూతన విద్యా విధానం 20-20ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లాలో అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐది అని కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ కొనియాడారు. సంక్షేమ హాస్టల కోసం ప్రభుత్వ విద్య కోసం అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించామన్నారు. ఈ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పైన పోరాటాలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్ , జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్ సందేశ్ మానస సంజన సన్నీ అక్షయ్. నాయకులు రఘు అశ్విని అమూల్య రమ్య మనోజ్ నవీన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.