చర్చ : సింగరేణి , క్రీడాకారులను అణగదొక్కుతున్న రాజకీయ జోక్యం…
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం – క్రీడలకు ముప్పు
సింగరేణి సంస్థలో ఇటీవల రాజకీయ నాయకుల జోక్యం హద్దులు దాటుతోంది. దీనికి నిదర్శనంగా, ఈరోజు నుంచి సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ప్రారంభమైన కంపెనీ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
ఈ టోర్నమెంట్లో నిజమైన స్పోర్ట్స్ మెన్షిప్ కనిపించడం లేదు. రాజకీయ పలుకుబడి ఉన్న వారి మాటే చెల్లుబాటు అవుతూ, అసలైన క్రీడాకారులను పక్కన పెట్టి, తమకు నచ్చిన వారినే ప్రోత్సహించడం జరుగుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీకి పని చేస్తూ, క్రికెట్లో నిరంతరం చురుగ్గా పాల్గొంటున్న సీనియర్ క్రీడాకారులను కాదని, ఇ మద్యే రిక్రూట్ అయి ఆట రాని వ్యక్తులకు రాజకీయ నాయకుల జోక్యంతో అవకాశం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది, ఇది తీవ్రమైన అన్యాయం అని , ఏరియా మరియు కార్పోరేట్ లెవెల్లో కూడా ఆడని, ఫిట్నెస్ లేని వ్యక్తులు నేరుగా కంపెనీ లెవెల్ టోర్నమెంట్లో అదిపోయడం చాలా విడ్డూరంగా ఉంది అని సింగరేణి క్రీడాకారులు వాపోతున్నారు.
క్రీడాకారులకు గౌరవం ఇవ్వడం మన బాధ్యత. క్రీడల్లో రాజకీయ జోక్యం కొనసాగితే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సింగరేణి క్రీడాకారులు హెచ్చరిస్తున్నారు.
స్పోర్ట్స్ మెన్ ను ఎంకరేజ్ చేయాలి కాని, ఇలా రాజకీయాలతో అనగతొక్కడం కరెక్ట్ కాదు అని క్రీడాకారులు వాపోతున్నారు.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని, ఇలాంటి సంఘటనలను తక్షణమే అరికట్టాలి. తక్షణమే ఇ విషయంపై స్పోర్ట్స్ సూపర్వైజర్ స్పందించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.