చర్చ నిజామాబాద్ : ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు విచ్చేయుచున్నా సందర్భంగా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు

చర్చ నిజామాబాద్ :కమిషనర్ ఆఫ్ పోలీస్,
నిజామాబాద్ వారి కార్యాలయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ పట్టణంలోని బర్దిపూర్ గ్రామ శివారు – కేశపూర్ రోడ్డులోని సభా స్థలంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనుటకు తేదీ: 06.02.2026 నాడు నిజామాబాద్ కు విచ్చేయుచున్నా సందర్భంగా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు మరియు మార్గ మళ్లింపులు (డైవర్షన్స్) అమలు చేయబడుచున్నవి
ఇందుమూలంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, తేదీ 06.02.2026 నాడు ఉదయం 09: 00 గంటల నుండి మధ్యాహ్నం 4 :00 గంటల వరకు క్రింది విధంగా ట్రాఫిక్ సూచనలు పాటించగలరని వాహనదారులను కోరడమైనది.
ట్రాఫిక్ మార్గ సూచనలు :
➤ ఆర్మూర్, జక్రాన్ పల్లి, ధర్పల్లి , సిరికొండ, ఇందలవాయి మరియు డిచ్పల్లి వైపు నుండి సభకు వచ్చే వాహనాలు:
NH-44 రోడ్డు వెంబడి డిచ్పల్లి , ధర్మారం, నడిపల్లి , ఎం.ఎన్.ఆర్ గెస్ట్ హౌస్ వద్ద “U” టర్న్ తీసుకొని కొత్తగా నిర్మించుచున్న నారాయణ కాలేజ్ పార్కింగ్ వద్దకు చేరుకోవాలి.
➤ మాక్లూర్ నందిపేట్ వైపు నుండి సభకు వచ్చే వాహనాలు :
దాస్ నగర్ , మాణిక్ బండార్ చెక్క నుండి అమ్రాద్ , ఓడ్డేటిపల్లి , కేశపూర్ మీదుగా త్రిమూర్తి COLD STORAGE సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలకు చేరుకోవలెను.
➤ బోధన్ వైపు నుండి వచ్చే వాహనాలు:
అర్సపల్లి జంక్షన్ – అర్సపల్లి రైల్వే గేటు –కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ఐ.డి.ఓ.సి నుండి కంటేశ్వర్ బైపాస్ మీదుగా మాధవ నగర్ బైపాస్ మీదుగా కేశపూర్ కమాన్ మీదుగా సుధీర్ రెడ్డి కాలేజ్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవలెను.
➤ వర్ని మోస్రా, చందూర్, వైపు నుండి వచ్చే వాహనదారులు :
వర్ని ఎక్స్ రోడ్ – ఆర్.ఆర్ ఎక్స్ రోడ్ – పులాంగు జంక్షన్ –రుక్మిణి చాంబర్ – పాంగ్రా – బోర్గం బ్రిడ్జ్ –మాధవ నగర్ రైల్వే గేటు మీదుగా కేశపూర్ కమాన్ మీదుగా సుధీర్ రెడ్డి కాలేజ్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవలెను.
➤ ఇతర వాహనాలు :
హైదరాబాద్ నుండి నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ మరియు బాన్సువాడ వైపుకు వచ్చి వెళ్లే వాహనాలకు సాధారణ రహదారులలో ఎటువంటి మార్పు ఉండదు.
కావున వాహనదారులు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సూచనలను అనుసరించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించగలరని కోరడమైనది