చర్చ, జగిత్యా :సేవా భావం, క్రమశిక్షణతో పనిచేయాలి

సేవా భావం, క్రమశిక్షణతో పనిచేయాలి
జిల్లా ఎస్పి అశోక్ కుమార్.*
చర్చ, జగిత్యాల,:సేవాభావం, నిబద్దత, క్రమశిక్షణ తో పనిచేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం
పదోన్నతి బదిలీపై జగిత్యాల జిల్లాకు వచ్చిన హెడ్ కానిస్టేబుళ్లు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ కొత్త గా జగిత్యాల కు వచ్చిన సిబ్బందికి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి తో పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.