చర్చ,రామగిరి: సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలకు ఆటల పోటీలు
చర్చ,రామగిరి: సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలకు ఆటల పోటీలు
ఈ నెల 23న, సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలకు దీపాలంకరణ పోటీలు, ఆటల పోటీలు, ఉత్తమ పర్యావరణహిత గృహాలంకరణ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఏరియా అధికార ప్రతినిధి బి.సుదర్శనం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18 న సాయంత్రం 4:00 గంటలకు స్థానిక రాణి రుద్రమ దేవి క్రీడా ప్రాంగణంలోని సి.ఇ.ఆర్. క్లబ్ నందు సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలకు ఆటల పోటీలు, 16 న మధ్యాహ్నం 3:30 గంటలకు మహిళా ఉద్యోగులకు జి.యం. కార్యాలయ ఆవరణలో ఆటల పోటీలు, ఈ నెల 15 న మధ్యాహ్నం 3 గంటలకు సెంటినరీ కాలనీ డిస్పెన్సరీ ప్రాంగణంలో సింగరేణి ఉద్యోగుల కుటుంబాల చిన్నారులకు వెల్ బేబీ షో పోటీలు, 17 న మధ్యాహ్నం 3:00 గంటలకు స్థానిక కమ్యూనిటీహాలు నందు దీపాలంకరణ పోటీలు, 20 న ఉత్తమ పర్యావరణహిత గృహాలంకరణ (కంపెనీ క్వార్టర్లు) పోటీలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. వెల్ బేబీ షో పోటీలలో పాల్గొనేవారు డిస్పెన్సరీ కార్యాలయం నందు సంప్రదించి చిన్నారుల టీకాల కార్డు తో పాటు, ఉద్యోగి గుర్తింపు కార్డు అందజేసి నమోదు చేయించుకోవాలని కోరారు. ఉత్తమ పర్యావరణహిత గృహాలంకరణ పోటీలలో పాల్గొను ఉద్యోగులు ఈ నెల 19 సాయంత్రం 5 గంటలలోపు జి.యం. కార్యాలయంలోని పర్సనల్ విభాగం నందు సంప్రదించి వారి పేరు, క్వార్టర్ వివరాలతో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ నెల 23 న ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్థానిక రాణి రుద్రమ దేవి క్రీడా ప్రాంగణం నందు నిర్వహించనున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.