చర్చ, రామగిరి: దేశవ్యాప్తంగా సింగరేణి సంస్థలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనాలు చెల్లించాలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి శ్రీనివాస్
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులు, సౌకర్యాల విషయంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్ మహల్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (SCCWU-IFTU) రాష్ట్ర నాయకత్వం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా టి.శ్రీనివాస్( IFTU – SCCWU ) గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ, ఈరోజు కోల్ ఇండియాలోని జార్ఖండ్, రాష్ట్రంలోని ఉన్న ఓపెన్ కాస్ట్ లను, బొగ్గు పరిశ్రమలను సందర్శించి అందులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి యొక్క వేతనాలు, ఇతర చట్టబద్ధహక్కుల ను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా రెండు లక్షల పదివేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వివిధ రంగాలలో నిర్వహిస్తున్నారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ రావాల్సినటువంటి హై పవర్ కమిటీ వేతనాలను యాజమాన్యాలు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమ లో అమలు చేయడం లేదని వారన్నారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ బొగ్గు రంగంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులందరికీ HPC వేతనాలు, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్, లాభాలలో వాటా,8.33% బోనస్, ఇన్సూరెన్స్, హాస్పటల్, సౌకర్యం తదితర హక్కులు సౌకర్యాలు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నరేష్ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ( GLBKS – FTU) రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్,,(SCCWU-IFTU) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న, రాష్ట్ర నాయకులు ఎన్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.