News & Views

చర్చ, రాజన్న సిరిసిల్ల: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు…

కేంద్ర ఆరోగ్య పథకాల పనితీరుపై సమీక్ష..

– స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్లలో 27 స్కానింగ్ కేంద్రాలు పనితీరు, చట్టపరమైన నిబంధనల అమలు, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఫారం ఆఫ్ ఆడిట్ వివరాలపై, ఏడు స్కానింగ్ సెంటర్ల దరఖాస్తుల రెన్యూవల్, రిజిస్ట్రేషన్ల కొరకు వచ్చాయని కమిటీకి తెలిపారు. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు గుర్తిస్తే 10,000 జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు.

అనంతరం బోయినపల్లి మండలంలోని విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ఆరోగ్య పథకాల పనితీరుపై సమీక్షించారు. గర్భిణీ స్త్రీల నమోదు, మొదటి చెకప్ వివరాలు, సాధారణ ప్రసవాలు, ప్రమాదకర సంకేతాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించి( ఐఎఫ్ఎ మాత్) హెచ్ఎంఐఎస్ ఆన్లైన్లో నమోదు కార్యక్రమంపై మరియు ఆడపిల్లల జననాలు (సెక్స్ రేషియో) తక్కువగా ఉండడానికి కారణాలపై సమీక్షించి, లక్ష్యాలు సాధించాలని లేనియెడల చర్యలు తీసుకుంటామని సూచించారు.