చర్చ : మొండికుంట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , కాలేజీ బస్సు బ్రేక్ డౌన్ అయ్యి మొండికుంట అడవి దగ్గర బోల్తా పడింది బస్సులో 45 మంది కాలేజీ పిల్లలు ఉన్నారు అని తెలుస్తుంది…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
బూర్గంపాడు మండలం మొండికుంట గ్రామం వద్ద కేఎల్ఆర్ కాలేజీ బస్సు బ్రేక్ డౌన్ అయ్యి మొండికుంట అడవి దగ్గర బోల్తా పడింది బస్సులో 45 మంది కాలేజీ పిల్లలు ఉన్నారు అని తెలుస్తుంది. ఇద్దరు ముగ్గురికి సీరియస్ గా ఉంటే భద్రాచలం ఆస్పటల్ పంపించారు ఇంకొక అమ్మాయి బస్సులోనే ఇరుక్కొని పోయి ఉంది చాలా డౌన్ గా ఉంది కాబట్టి బస్సు లేపడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక బాలిక చేతికి తీవ్ర గాయం అయినట్లు సమాచారం ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులలో నలుగురికి చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి.
ఒక విద్యార్థికి ఛాతీ ఎముకలు విరగడం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి.