చర్చ : గోదావరిఖని , సింగరేణి హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య శిభిరం…

సింగరేణి హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య శిభిరం..
గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 16 న హైదరాబాదు ఓమెగా హాస్పిటల్ వారి ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్న ట్లు ఆర్జీ వన్ జి.యం డి.లలిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ , నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల డాక్డర్లు వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
రామగుండం ఏరియా పరిదిలోని ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 , ఏఎల్పీ గనుల ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు, సిపిఆర్ఎమ్ ఎస్ ఇ,సిపిఆర్ఎంఎస్ఎన్ ఇ కార్డు కలిగిన రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ నెల12 వ తేది నుండి ఏరియా ఆసుపత్రి వద్ద తమపేర్లు
నమోదు చేసుకోవాలని కోరారు.