చర్చ,గోదావరిఖని : ఆదరించండి అభివృద్ది చేస్తా..
ప్రచారంలో దూసుకుపోతున్న 43 వ డివిజన్ ఏఐఎఫ్ బి అభ్యర్థి మద్దెల దినేష్ .

చర్చ,గోదావరిఖని:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 43వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ పార్టీ కూటమిలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు.డివిజన్ ప్రజల నుంచి ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రతి వీధిలో గడప గడపకు సింహం గుర్తుతో కూడిన కరపత్రాలు పంచుతూ డివిజన్ లో అధికారం లేకపోయినప్పటికీ ప్రభుత్వంతో, అధికారులతో పోరాడి చేయించిన అభివృద్ధి మరియు భవిష్యత్ లో చేయబోయే పనులను ఓటర్లకు వివరిస్తూ సింహం గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
మీరు వేసే ఒక్క ఓటుతోనే మన డివిజన్ అభివృద్ధి పథంలో ముందుంటుందని, ఇందుకు స్థానికంగా ఉన్న అభ్యర్థిని, విద్య వంతులైన మరియు డివిజన్ పై అవగాహన ఉన్న వ్యక్తిని గెలిపించాలని,డివిజన్ లో నెలకొన్న సమస్యలు వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని కనుక నాకు ఓటువేసి కార్పొరేటర్ గా అవకాశం కల్పించి, మన డివిజన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని కోరారు.