News & Views

చర్చ, జగిత్యాల : క్షయ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోండి – జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్

క్షయ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోండి – జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్

చర్చ, జగిత్యాల
క్షయ నిర్ధారణ పరీక్షలను వినియోగించుకోని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాల గాంధీనగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక ఎక్స్ రే మిషన్ తో టి. బి. నివారణ సులభతరమైందన్నారు. టి. బి నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిభిరంలో 53 మందికి మొబైల్ ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, జ్వరం, దగ్గు లక్షణాలు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కృష్ణకుమారి, పి. హెచ్. ఎమ్ వేణుగోపాల్, ఎస్. టి. ఎస్ శ్రీనివాస్, సూపర్ వైజర్ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్స్ రాజీవ్, షాబొద్దీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.