News & Views

చర్చ,రామగిరి: సింగరేణి పురోభివృద్ధికి TBGKS నిర్మాణాత్మకంగా పని చేయాలి

  •  ఓసిపి1 ప్రాజెక్ట్ అధికారి, మేనేజర్ లకు,నూతన కమిటీ పరిచయ సన్మానం

సింగరేణి సంస్థ లో గత గుర్తింపు సంఘంగా అనుభవం కలిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు కార్మికుల సంక్షేమానికి మరియు నిర్దేశిత బొగ్గు ఉత్పత్తికి కంపెనీ పురోభివృద్ధికి సైతం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఓసి 1 ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ వి ఫాటింగ్ పేర్కొన్నారు సోమవారం ఓసిపి 1 నూతన పిట్ కమిటీని పిఓ తో పాటు కాలరీ మేనేజర్ ఆర్ పాపయ్య మరియు సంక్షేమాధికారి సాయి స్వరూప్ గార్లకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆర్జీ 3 ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య నూతన కమిటీ సభ్యులను పరిచయం చేశారు.

ఓసి 1 పిట్  సెక్రటరీ గా గిటుకు శ్రీనివాస్ , నాన్ ఆపరేషన్ ఫిట్ సెక్రటరీ భోగం పూర్ణాకర్, సెంట్రల్ కమిటీ నాయకులు జి చంద్రశేఖర్ బి శ్రీకాంత్ రావు తోపాటు  సభ్యులను పరిచయం చేశారు అసిస్టెంట్ పిట్ సెక్రటరీలుగా చెలిమెల శ్రీనివాస్,  సైన్ల సత్యనారాయణ, కే మల్లేశం షిఫ్టు మరియు సెక్షన్ ఇంచార్జిలుగా దురికి  తిరుపతి, అబ్దుల్ కమర్, ఎండి షఫీక్, కొండా రవి, డి శ్రీనివాస్, ఎం నర్సింగరావు, బి బాబురావు జి తిరుపతి ఎస్వి రావు, తో పాటు జాయింట్ సెక్రటరీలుగా మండల శ్రీనివాస్, గరిమెల రవీందర్, ఠాకూర్ రూపేష్ సింగ్, జె.సాయికుమార్, కుంట సత్యం, పి శ్రీకాంత్, కె.వి రాఘవరెడ్డి,కూతాటి వెంకటయ్య, సిహెచ్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సముద్రాల మహేందర్,  నరివేడ్డి రవీందర్, కొండ తిరుపతి, అంబాల కొమరయ్య, వేణుగోపాల్ రెడ్డి, కే కొమ్మాలు, సిహెచ్ కుమార్, బ్రాంచ్ కమిటీ మెంబర్లు తొగరి ప్రవీణ్ నల్ల అశోక్ అల్లం తిరుపతి మైపాల్ రెడ్డి వేగోళం మల్లయ్య

అదేవిధంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఫాటింగ్  కు ఘనంగా స్వాగత సత్కారం నిర్వహించి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు .

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికారంలో ఉన్న సందర్భంలో కార్మికుల సంక్షేమం కోసం మరియు కంపెనీ  అభివృద్ధికి చేసిన కృషిని ఇప్పటికీ అందరూ మెచ్చుకుంటున్నారని  వివరించారు

ఈ కార్యక్రమంలో సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పింగిలి సంపత్ రెడ్డి,  సెంట్రల్  నాయకులు దేవ శ్రీనివాస్ ,పాశం శ్రీనివాస్ రెడ్డి , కేశవరావు గట్టు శ్రీనివాస్,  మరియు వివి గౌడ్ పూసల శేఖర్ గండి శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.