చర్చ, ములుగు జిల్లా: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి – జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల టవి వీరభద్రం
ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
- ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల సాధన ,విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఎస్ టి యు నిరంతర పోరాటం.
జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల టవివీరభద్రం
చర్చ ములుగు జిల్లా:
వెంకటాపురం మండల కేంద్రం లో “స్టేట్ టీచర్స్ యూనియన్” (ఎస్ టి యు) మండల అధ్యక్షులు పుణెo రమణయ్య, ప్రధాన కార్యదర్శి పాండా రామారావు ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల టవివీరభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష అనేది తీవ్ర మానసిక సంకటంగా మారిందని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, బావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమర్థవంతులని వారు ఎన్ని పరీక్షలైనా ఎదుర్కొని నిలుస్తారని అన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి అనే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఉపాధ్యాయులను ఇలా ఒత్తిడికి గురి చేయడం వలన తరగతిగది బోధన నాణ్యత దెబ్బతింటుందని, తరగతిగది బోధన అభ్యసన ప్రక్రియకు ఇది ఆటంకంగా మారిందని అన్నారు.
సమర్థవంతమైన ఉపాధ్యాయులకు మళ్లీ మళ్లీ పరీక్షలు ఎందుకని ప్రశ్నించారు. కావునా ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని అన్నారు.
ప్రస్తుత0 ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్ సమస్యపై, ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కలిగించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘం సుప్రీంకోర్టు లో న్యాయపోరాటం చేస్తున్నదనీ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై స్టేట్ టీచర్స్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.
మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బలమైన కార్యకర్తల బృందం సంఘం ఎస్టీయూ సంఘం సొంతం అని, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కరించడంలో స్టేట్ టీచర్స్ యూనియన్ ముందుంటుందని అన్నారు.
రాష్ట్రంలో ,జిల్లాలలో మండల స్థాయిలో అత్యంత చురుకైన నాయకత్వం కలిగి, బలమైన ఉపాధ్యాయ సంఖ్య సభ్యత్వం కలిగిన సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్ టి యు) అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల అధ్యక్షులు అడప రాజేందర్, ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ రాంబాబు జిల్లా అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఎస్ బి నాయుడు అసోసియేట్ అధ్యక్షులు పోతు రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు, ఉపాధ్యాయులు .శిరీషా, ఉషారాణి, సమ్మక్క ,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.