చర్చ, జగిత్యాల: ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల నిధులిస్తా – ఎకగ్రీవ పాలకవర్గ ప్రతినిధులకు ఎమ్మెల్యే సన్మానం
ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల నిధులిస్తా
ఎకగ్రీవ పాలకవర్గ ప్రతినిధులకు ఎమ్మెల్యే సన్మానం
చర్చ, జగిత్యాల: గ్రామాల్లో ప్రజలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని,
ఏకగ్రీవ గ్రామాలు నియోజకవర్గానికి ఆదర్శం గా నిలిచాయని. మరిన్ని గ్రామాలను ఏకగ్రీవ పంచాయతీలుగా చేసేందుకు నాయకులు, పెద్దలు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇలా ఎకగ్రీవమైన పంచాయతీ లకు పది లక్షల నిధులను మంజూరు చేస్తా నని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
శుక్రవారం సారంగాపూర్ మండల భీం రెడ్డి గూడెం, నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సత్కరించి ఎమ్మెల్యే అభినందించిచారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ లు మైనేని ప్రమీల నరేష్, నాయకపు గూడెం సర్పంచ్ కొత్తూరు పుష్ప నాథ్, ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు, మాజీ ఎంపిటిసి లక్ష్మణ్, నాయకులు శేఖర్ గౌడ్, జగన్, మహేష్, అంజి నాయకులు తదితరులు పాల్గొన్నారు.