చర్చ,గోదావరిఖని: జిడికే 11 ఇంక్లైన్ గనిలో ఘనంగా 56 వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు…
చర్చ,గోదావరిఖని:
జిడికే 11 ఇంక్లైన్ గనిలో ఘనంగా 56 వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు…
గురవారం సింగరేణి సంస్థ రామగుండం ఏరియా వన్ జీడికే 11 ఇంక్లైన్ నందు సింగరేణి స్థాయి 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయిబాబు జియం (సేఫ్టే) కార్ఫోరేట్, తనిఖీ కన్వీనర్ సైదులు జియం ఎన్విరాన్మెంట్ కార్ఫోరేట్, అర్జీ.1 జియం లలిత్ కుమార్, ఎఐటియుసి డిప్యూటి జనరల్ సెక్రటరి మడ్డి ఎల్లాగౌడ్ హాజరై రక్షణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగాఅదికారులు,నాయకులు మాట్లాడుతూ చేసే పనిలో చిన్న నిర్లక్షం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని అన్నారు. రక్షణపై అవగాహనతో పనులు చేసి సంస్థ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. రక్షణలో అత్యుత్తుమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం రక్షణ కమిటీ సభ్యులు జిడికే 11 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ 1 సీం సందర్శించి రూఫ్, సైడ్ వాల్ రక్షణ కోసం చేపట్టిన జాగ్రత్తలు పరిశీలించారు. రక్షణ కు ఏవిధమైన చర్యలు తీసుకుంటారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జియం సేఫ్టీ రామగుండం రీజియన్ మధు సుదన్, యస్. ఓటు జియం చంద్రశేఖర్, ఏజంట్ చిలుక శ్రీనివాస్, కమిటి సభ్యులు పి.శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్,బి దేశాయ్, మహేందర్, షైక్ ఖమ్ రుద్దిన్,, సునీల్ కుమార్, ఆదినారాయణ, వెంకట స్వామీ, గని మేనేజర్ మల్లేశం, గ్రుఫ్ ఇంజనీర్ రాందాస్, ఫిట్ సెక్రటరి నాయిని శంకర్, యునియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.