చర్చ, జగిత్యాల : ఫోన్ చేసేది మావాళ్లు కాదు – జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన
జగిత్యాల మున్సిపల్ పరిధిలో వ్యాపారాలు చేసుకొనే వారిని ట్రేడ్ లైసెన్స్ రినివల్ చేస్తామని కొందరు ఫోన్ ద్వారా అడుగుతున్నారని వారు మా ఉద్యోగులు కాదని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని వ్యాపారుల్లో ట్రేడ్ లైసెన్స్ కలిగిన వారు తమ లైసెన్స్ రినివల్ కోసం మీ సేవ కేంద్రములో పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే సిడిఎంఏ సైట్ ద్వారా లైసెన్స్ రినివల్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకొన్న జిరాక్స్ పత్రాలను మున్సిపల్ ఆఫీస్ లో అందజేయాలని కోరారు. ట్రేడ్ లైసెన్స్ రినివల్ చేస్తామని మున్సిపల్ ఉద్యోగుల వలె కొందరు వ్యాపారులకు ఫోన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ పేర్కొన్నారు. ఆలా ఫోన్ చేస్తున్నది తమ ఉద్యోగులు కాదని ఇలాంటి మోసగాళ్ళ పట్ల వ్యాపారులు జాగ్రత్తగా వుండాలని కమిషనర్ స్పందన కోరారు.