చర్చ, కరీంనగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల పేద ప్రజలకు లబ్ధి
- హెల్ప్ డెస్క్ ద్వారా సహాయం అందిస్తుస్తున్నాం
- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లోని స్థానిక సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక అయ్యిందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మందిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నామన్నారు. ఇప్పటికి దాదాపు ఐదు వందలకు పైగా కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో లేదా సుడా కార్యాలయంలో బాధితులు సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.