చర్చ, ములుగు: చల్వాయి లో జోరుగా సాగుతున్న ఇంటిoటి ప్రచారం
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామం లో శుక్రవారం నాడు గ్రామ అధ్యక్షులు నామ్ పూర్ణ చందర్ ఆధ్వర్యంలో ఇంటిoటి ప్రచారం జోరుగా సాగింది . బి ఆర్ ఎస్, కాంగ్రెస్, బిజె పి పార్టీ లు బలపరిచిన11 వ వార్డ్ అభ్యర్థి పల్లపు కుమార్ గ్యాస్ పొయ్యి గుర్తుకు అమూల్య మైన ఓటు వేసి గెలిపించండి అని గ్రామ ఓటర్ల ను అభ్యర్థిoచడం జరిగింది.
11 వార్డ్ లో ఉన్న ఎటువంటి సమస్యనైనా మీ వెనంటే ఉండి పరిష్కారిస్తానని , ప్రజలకు సేవ చేయాలని దృక్పధం తో ఉన్నానని, పల్లపు కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఒక్క సారి అవకాశం కల్పించoడి నా వంతుగా అభివృద్ధికి పాటుపడతానని అన్నారు .అత్యదిక మెజారిటీ తో గెలిపించి ఆశీర్వదిoచగలరని వేడుకున్నారు.
ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు, పల్లపు కుమార్, భూరెడ్డి మధు, సామ రాంరెడ్డి,రేండ్ల శ్రీనివాస్, దర్శనాల సంజీవ,బైకని ఓదెలు, కుమ్మరి వెంకన్న, బాబు, నాగార్జున, వేణు, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, రాధ, తదితరులు పాల్గొన్నారు.