News & Views

చర్చ పాల్వంచ: పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా కార్తీకమాసోత్సవం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా కార్తీకమాసోత్సవం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

చర్చ పాల్వంచ

పాల్వంచ మండలంలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య వెలసిన
శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) నందు కార్తీకమాసం బహుళ ఏకాదశి సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆదేశముల మేరకు నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతములతో అభిషేకములు, లక్ష బిల్వర్చన అనంతరం హారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశదీపం నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ఆవరణ సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వ్రతంలో పాల్గొని శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి తీర్థప్రసాదములు స్వీకరించారు.ఈ కార్యక్రమములలో దేవస్థాన పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు చెవుగాని పాపారావు, దుగ్గిరాల సుధాకర్, శనిగారపు శ్రీనివాసరావు, అడుసుమిల్లి సాయిబాబా , సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.