News & Views

చర్చ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడలు తక్షణమే అమలు చేయాలి – ఐఎఫ్టియు జాతీయ కమిటీ

ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడలు తక్షణమే అమలు చేయాలని ప్రకటనను విరమించుకోవాలి.
ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ప్రతుల దగ్ధం  

చర్చ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ:
ఈరోజు పాల్వంచ నటరాజ్ సెంటర్లో ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ప్రతుల దగ్ధం,
నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే అమలు చేయాలనే ప్రకటనను విరమించుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పాల్వంచ నటరాజ్ సెంటర్లో నాలుగు లేబర్ కోడ్ ల ప్రజలను దగ్ధం చేయడం జరిగింది.
అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులను 44 లేబర్ చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రాలలో అమలు కానివ్వకుండా అనేక ఉద్యమాలు నిర్వహించింది. ఈ నాలుగు లేబర్ కోడుల వలన 12 గంటల పని విధానం అమలులోకి వస్తుందని కార్మికుల సెలవులు తీసివేయబడతాయని యూనియన్ పెట్టుకునే అర్హతను కోల్పోతారని కార్మికులకు నష్టం చేసే ఈ చట్టాలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇప్పుడు బీహార్ లో గెలిచామని అహంకార దోరణితో నాలుగు లేబర్ కోడ్ లను పకడ్బందీగా అమలు చేయాలని ప్రకటనను రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంక్షలు పెట్టడాన్ని ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది 44 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో పోరాటాలతో సాధించుకున్నామని కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడేవని నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు హక్కులను కాలు రాస్తూ తిరిగి కార్మికులను బానిస వర్గంలోకి శ్రమదోపిడిలోకి నెట్టి వేస్తుందని కార్మికుల్ని తగ్గించి శ్రమ దోపిడీ చేసి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తాకట్టుపెట్టే ఈ నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శ్రీను మల్లేష్ లాజర్ రమేష్ గోపి వెంకటేశ్వర్లు మహేష్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులను 44 లేబర్ చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రాలలో అమలు కానివ్వకుండా అనేక ఉద్యమాలు నిర్వహించింది. ఈ నాలుగు లేబర్ కోడుల వలన 12 గంటల పని విధానం అమలులోకి వస్తుందని కార్మికుల సెలవులు తీసివేయబడతాయని యూనియన్ పెట్టుకునే అర్హతను కోల్పోతారని కార్మికులకు నష్టం చేసే ఈ చట్టాలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇప్పుడు బీహార్ లో గెలిచామని అహంకార దోరణితో నాలుగు లేబర్ కోడ్ లను పకడ్బందీగా అమలు చేయాలని ప్రకటనను రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంక్షలు పెట్టడాన్ని ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది 44 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో పోరాటాలతో సాధించుకున్నామని కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడేవని నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు హక్కులను కాలు రాస్తూ తిరిగి కార్మికులను బానిస వర్గంలోకి శ్రమదోపిడిలోకి నెట్టి వేస్తుందని కార్మికుల్ని తగ్గించి శ్రమ దోపిడీ చేసి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తాకట్టుపెట్టే ఈ నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శ్రీను మల్లేష్ లాజర్ రమేష్ గోపి వెంకటేశ్వర్లు మహేష్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.