చర్చ,రామగుండం: రాజీమార్గమే రాజ మార్గం..
- జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా పలు కేసులు పరిష్కారం .
- రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా వెల్లడి..
రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న వివిధ కేసులు సోమవారం నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించినట్లు సిపి అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. ( కాంఫౌండబుల్) IPC కేసులు 386,ఇ-పెట్టీ కేసులు 2971,
డ్రంక్ & డ్రైవ్ కేసులు1038,
మొత్తం 4411కేసులు పరిష్కరించినట్లు సిపి అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
54 సైబర్ నేరాలకు సంబందించి 24,98,879 నగదు బాధితులకు రిఫండ్ చేయించినట్లు పేర్కొన్నారు.
సిసిపిఎస్ పోలీస్ స్టేషన్ లోమోదైన ఐదు కేసులలో 28,25,226 బాధితులకు రిఫండ్ అయినట్లు తెలిపారు.
మొత్తం 59 సైబర్ నేరాలకు సంబంధించి బాధితులకు తిరిగి రిఫండ్ అయినా మొత్తం రూ.53,24,105 నగదు అందజేసినట్లు పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత పదిహేను రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించి టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారిని సిపి అబినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, ప్రతిరోజు మానిటర్ చేసిన అధికారులకు, రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిదిలో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన రెండు జోన్ ల ప్రధాన న్యాయమూర్తి లకు , జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు, పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కోసం కృషిచేసిన అధికారులు , సిబ్బంది ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.