చర్చ : రామగిరి, రత్నాపూర్ రేణుక ఎల్లమ్మ గుడి లో దొంగతనం
రత్నాపూర్ రేణుక ఎల్లమ్మగుడిలో దొంగతనం
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. దేవాలయంలోని అమ్మవారి పైన ఉన్న అర తులం బంగార పుస్తేలు, గుండ్లు, 12 తులాల వెండి సామాగ్రి, వడ్డాణాలు, దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలోని హుండీ పగలగొట్టి, అందులోని డబ్బులను తీసుకుని హుండీని దూరంగా పొదలలో పడేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఆభరణాల విలువ సుమారు రూ. 63 వేల వరకు ఉంటుందని గౌడ సంఘం అధ్యక్షులు ముక్కర కుమార్ రామగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ, శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్ నుండి డాగ్స్ స్క్వాడ్ వచ్చి దొంగలు ఎటువైపు పారిపోయి ఉంటారని పరిసరాలను పరిశీలించాయి.