News & Views

చర్చ హైదరాబాద్ : స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు?


చర్చ హైదరాబాద్ : వచ్చే వారంలో స్కూళ్లకు వరుసగా 3రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఈ నెల 11న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవు ఉండే ఛన్స్ ఉంది.