చర్చ,గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లాలో పులి సంచారం..
రామగుండం మండలం గోదావరినది,లింగాపూర్ శ్మశాన వాటిక సమీపంలో పులి అడుగులు గుర్తించిన పారెస్ట్ అదికారులు..

రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన ఓపెన్ కాస్ట్ 4 సమీపంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు. పక్కనే ఉన్న మంచిర్యాల సరిహద్దు ప్రాంతంలో నిన్నటి వరకు సంచరించిన పులి గోదావరి నది దాటి పెద్దపెల్లి జిల్లా సింగరేణి ఓసీపీ 4, పక్కనే ఉన్న లింగాపూర్ గ్రామ సమీపంలోని స్మశాన వాటిక సమీపంలో పులి అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు దీంతో సమీప గ్రామాల ప్రజలు వ్యవసాయ కూలీలు భయాందోళనలకు గురవుతున్నారు.