News & Views

చర్చ,రామగుండం: టిబి చాంపియన్లకు శిక్షణా కార్యక్రమం

చాంపియన్లకు శిక్షణా కార్యక్రమం


చర్చ,రామగుండం:

టిబి చాంపియన్లకు శిక్షణా కార్యక్రమం..

టిబి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని, వ్యాదిపై అవగాహన కల్పిస్తూ సేవ చేస్తున్న టిబి చాంపియన్స్ కు జిల్లా టి.బి ప్రొగ్రాం అదికారి డా. K.V సుదాకర్ రెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం రామగుండం యుపిహెచ్ సి లో 15 ఆమ్ సెంటర్లకు చెందిన 30 మంది టిబి చాంపియన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వాణి శ్రీ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఈ శిక్షణ ద్వారా వ్యాది సోకకుండా గ్రామస్థాయిలో మరింత అవగాహన చర్యలు చేపట్టాలని చాంపియన్లకు సూచించారు..
ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ స్టేట్ లీడ్ మిస్టర్ పురుషోత్తం,డిస్టిక్ లీడ్ దేవోజు శ్రీనివాస్, టిబి రిసోర్స్ పర్సన్ దాసరి అంజలి మాట్లాడుతూ
పెద్దపల్లి జిల్లాలో టిబి కేసులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చాంపియన్లకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ సదుపాయాలు,టిబి లక్షణాలు,వ్యాధి నిర్ధారణ పద్ధతులు,చికిత్స విధానంపై
పలు సూచనలను తెలియజేశారు..
ఈ శిక్షణ అనంతరం, టిబి చాంపియన్లు తమ తమ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఆమ్ సెంటర్లు) పరిధిలో గ్రామసభలు, మహిళా సంఘాల మీటింగులు, పాఠశాలలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని
తమ వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ, టిబి పట్ల అవగాహన కల్పించాలన్నారు. టిబి ఇన్ఫెక్షన్ కేసులు, టిబి వల్ల మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఏంఅండ్‌హెచ్ఓ డా. వాణిశ్రీ , ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ రాజమౌళి ,డా. లక్ష్మీ భవాని
డా. శ్రీధర్ ,యూపీఎచ్ ఎస్ రామగుండం, టీయూ రామగుండం, ఎస్‌టీఎస్ మిస్టర్ గోపి
హెచ్‌ఈఓ నాగభూషణం,
సమ్మయ్య ,
హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.