News & Views

చర్చ,మంచిర్యాల: సర్పంచ్ ఎన్నికల బరిలో ట్రాన్స్ జెండర్

చర్చ,మంచిర్యాల: సర్పంచ్ బరిలో ట్రాన్స్ జెండర్

జైపూర్ మండలం వెంకట్రావు పల్లి పంచాయతీ సర్పంచి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ కుమ్మరి వైశాలి గురువారం నామినేషన్ వేశారు. వైశాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చెన్నూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. మరి ఈ సారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటారా? ఉపసంహరించుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.