కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో ఘన నివాళులు

DPEO జ్యోతి కిరణ్ ఆధ్వర్యంలో సంతాప సభ
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా :
నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్ల దాడిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ఆసిఫాబాద్ ఎక్సైజ్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది….
ఈ సందర్భంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో సౌమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ మాట్లాడుతూ,
“సౌమ్య విధి పట్ల చూపిన అంకితభావం ప్రతి ఎక్సైజ్ సిబ్బందికి స్ఫూర్తిదాయకం. గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై పోరాటంలో ప్రాణత్యాగం చేసిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం సంపూర్ణ అండగా నిలవాలి” అని పేర్కొన్నారు.
అలాగే గంజాయి స్మగ్లింగ్ నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత అప్రమత్తతతో పని చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎక్సైజ్ సిబ్బంది, అధికారులు పాల్గొని సౌమ్యకు నివాళులర్పించారు