చర్చ,రామగుండం: భరత జాతి బానిసత్వపు విముక్తి జనజాగృతి గీతం వందేమాతరం..

భరత జాతి బానిసత్వపు విముక్తి …..
జనజాగృతి గీతం వందేమాతరం..
చర్చ,రామగుండం:
రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా..
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న బంకింఛంద్ర చటర్జీ రచించిన ఈ అద్భుతమైన వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారంన వందేమాతర గీతాలాపన కార్యక్రమం రామగుండము పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కి పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరై అధికారులు, సిబ్బంది తో కలిసి వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు .
ఈ సందర్బంగా సిపి గారు మాట్లాడుతూ ..భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలంలో జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది. జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది. మన గర్వం, గౌరవం, ఉమ్మడి గుర్తింపును పెంపొందిస్తూ మనందరికీ ఐక్యం చేస్తున్న జాతీయ గేయాన్ని గౌరవించేందుకు.. దేశభక్తి, కృతజ్ఞతకు సమష్టి ప్రతీకగా ఈ కార్యక్రమాలలో దేశ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ ఐ లు వామన మూర్తి, మల్లేశం, సూపరిండెంట్స్ ఇంద్రసేనారెడ్డి, సందీప్,సంధ్య, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎసఐ లు, ఆర్ ఐ లు శ్రీనివాస్, వామన మూర్తి, మల్లేశం, సిసి హరీష్, సీపీఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.