చర్చ, కరీంనగర్ జిల్లా: వృధాగా పోతున్న వీణవంక చెరువు నీరు – ఆందోళనలో మత్స్యకారులు
వృధాగా పోతున్న వీణవంక చెరువు నీరు?
- ఆందోళనలో మత్స్యకారులు
- తగిన చర్యలు చేపట్టాలి..మత్స్యకారుల డిమాండ్
కరీంనగర్ జిల్లా: వీణవంక మం చెరువు నుండి నీరు బయటకు పోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి భారీ దెబ్బ తగిలింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అవసరానికి మించి నీరును వదలడంతో
చెరువులో నీటి నిల్వ తగ్గడంతో చేపల పెంపకం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ఈ చెరువు పై సుమారు 200 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు
కావున చెరువు నీటిని వృధా పోకుండా చూడాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సహకార సంఘం అధ్యక్షులు మోటాం వెంకటేష్ పెద్ద, కార్యదర్శి కుమార్ స్వామి,
డైరెక్టర్లు చుక్కల రవీందర్ ,
ఐలవేణి రామ్ , రాయిశెట్టి సదానందం గుర్రం కొమురయ్య రాయిశెట్టి సంపత్ డైరెక్టర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు